CRPF SI Killed in mulugu : వెంకటాపురంలో జవాన్ కాల్పులు.. సీఆర్పీఎఫ్ ఎస్సై మృతి - కానిస్టేబుల్ ఎస్సైకి మధ్య కాల్పులు
09:13 December 26
ములుగు జిల్లాలో జవాన్ల మధ్య కాల్పులు.. సీఆర్పీఎఫ్ ఎస్సై మృతి
CRPF SI Killed in mulugu : ములుగు జిల్లా వెంకటాపురంలో ఓ జవాన్ జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఎస్సై మృతి చెందారు. వెంకటాపురంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఘటనలో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్‌కు చెందిన ఎస్సై ఉమేశ్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్ మధ్య వాగ్వాదం జరిగింది. భోజనం తయారీ విషయంలో గొడవ జరగగా... క్షణికావేశంలో ఎస్సై ఉమేశ్ చంద్రపై కానిస్టేబుల్ స్టీఫెన్ కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతరం స్టీఫెన్ తనను తానూ కాల్చుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
ఈ కాల్పుల ఘటనలో బిహార్‌కు చెందిన ఉమేశ్ చంద్ర అక్కడికక్కడే మరణించారు. తమిళనాడుకు చెందిన స్టీఫెన్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల, ఛాతీ భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో స్టీఫెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతడిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ లేదా హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:4 CRPF Jawans Killed: సెలవులపై గొడవ.. సహచరులపై జవాన్ కాల్పులు.. నలుగురు మృతి