తెలంగాణ

telangana

ETV Bharat / crime

రుణాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు వసూలు - రుణాలు ఇప్పిస్తామంటూ బురిడి

చదివింది పదో తరగతి. బెంజి కారులో తిరుగుతూ దర్జా. ఇవే పెట్టుబడిగా ఎందరినో బురిడీ కొట్టించాడు. అప్పులు ఇప్పిస్తానని నమ్మించి పలువురి నుంచి నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

crores of rupees cheating,  Hyderabad crime news
రుణాలు ఇప్పిస్తానంటూ రూ.కోట్లు వసూలు

By

Published : Apr 9, 2021, 8:46 AM IST

ఓ వ్యక్తి కోట్ల రూపాయల రుణాలు ఇప్పిస్తామంటూ పలువురిని బురిడి కొట్టించాడు. కానీ చివరకు దొరికిపోయాడు. వరంగల్‌ జిల్లా హన్మకొండ మండలం న్యూరాయ్‌పూర్‌కు చెందిన మిర్జాఖాదర్‌ భాయ్‌ అలియాస్‌ సమర్‌మిర్జా(36) పదో తరగతి వరకు చదివాడు. పొట్టకూటి కోసం నగరానికి వలస వచ్చాడు. బంజారాహిల్స్‌లో నివాసముంటూ 2020 డిసెంబరులో గచ్చిబౌలిలోని పీఎస్‌ఆర్‌ ప్రైమ్‌ టవర్స్‌ భవనం ఐదో అంతస్తులో కార్యాలయం అద్దెకు తీసుకున్నాడు. మిస్టర్‌ బిల్డర్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్ పేరిట ఓ బోర్డు పెట్టాడు. అక్కడ పనిచేసేందుకు 30 మంది సిబ్బందిని నియమించుకున్న అతను.. సదరు కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రచారం చేసుకున్నాడు. అవసరమైన వారికి వ్యాపార, గృహ, నిర్మాణ, వ్యక్తిగత రుణాలను తమ కంపెనీ ద్వారా ఇప్పిస్తామంటూ.. ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించాడు. నమ్మి వచ్చిన వాళ్లను నట్టేట ముంచాడు.
రూ.2.18 కోట్ల రుసుం
రెండు కంపెనీలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మోహన్‌రావు వ్యాపార విస్తరణకు రూ.300 కోట్ల రుణం కావాలని కోరగా ప్రొసెసింగ్‌ రుసుం కింద రూ.2.18 కోట్లు వసూలు చేశాడు. రూ.పది కోట్ల రుణం కోరిన తిరుమలగిరి ప్రాంతానికి చెందిన దినేష్‌కుమార్‌ నుంచి రూ.71 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదు. రూ.8 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించి ఏపీలోని కృష్జా జిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన రైౖస్‌మిల్‌ వ్యాపారి వి.ఎన్‌.వి.ప్రభాకర్‌రావు నుంచి రూ.30 లక్షలు తీసుకున్నాడు. ఇలా 18 మంది నుంచి నాలుగున్నర కోట్లు వసూలు చేశాడు. బాధితుల్లో ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్‌ ఎస్‌వోటీ బృందం, గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ వివరాలు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details