యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయమై.. కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ ఇద్దరు దివ్యాంగుల వద్ద రూ.30 లక్షలు వసూలు చేశాడు. చివరకు వారికి మొండి చేయి చూపించాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనివాస రావు అనే వ్యక్తి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల రామ్‌నగర్‌కు చెందిన ఇద్దరు దివ్యాంగులకు ఫోన్ చేశాడు. వ్యాపారానికి రూ.15 లక్షలు లోన్ ఇప్పిస్తామని నమ్మబలికాడు.
కేటీఆర్ పీఏ అని నమ్మించి.. రూ.30 లక్షలు దోచుకున్నాడు
కేటీఆర్ పీఏనని నమ్మించి ఓ వ్యక్తి దివ్యాంగులను మోసం చేశాడు. వ్యాపారం పెట్టుకునేందుకు లోన్ ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో బురిడీ కొట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామ్‌నగర్‌లో చోటుచేసుకుంది.
handicapped cheated
నమ్మిన వాళ్లు ఆధార్ కార్డు ప్రతులు, ఫొటోలను తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఫోన్ చేసి ఇ- వ్యాపారం కోసం కాకుండా రూ.60 లక్షల్లో మంచి ఇల్లు చూసుకోండి అని చెప్పాడు. ఇంటి కోసం రూ.30 లక్షలు ఏర్పాటు చేసుకుంటే మరో 30 లక్షలు తాను ఇప్పిస్తానన్నాడు. ఆ డబ్బును అతనికి ఇచ్చారు. చివరకు మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. తమను మోసగించిన వ్యక్తిని అరెస్టు చేయాలని బాధితులు వేడుకున్నారు.
ఇదీ చదవండి:ఎరక్కపోయి వచ్చాడు.. ఇరుక్కుపోయాడు
Last Updated : May 6, 2021, 6:48 PM IST