తెలంగాణ

telangana

ETV Bharat / crime

దర్యాప్తునకు వెళ్లిన కానిస్టేబుళ్లపై తల్వార్​తో దాడి - Attack on police with talwar is the latest news

A person Attacked Police: హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. నిన్న ఇద్దరిపై దాడి చేసి.. ఒకరిని చంపేసిన దొంగను పట్టుకునేందుకు వెళ్లిన.. పోలీసులపైనే కత్తితో దాడి చేశాడు. దుండగుడి కత్తి పోట్లకు ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా.. మరొక కానిస్టేబుల్‌ను తలపై దాడి చేశాడు. ఇద్దరు కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించారు. పోలీసులపైనే దుండగుడు దాడి చేయడంతో నగరంలో కలకలం రేపింది.

A person Attacked Police
A person Attacked Police

By

Published : Jan 5, 2023, 5:17 PM IST

Updated : Jan 5, 2023, 9:12 PM IST

A person Attacked Police: హైదరాబాద్‌ జగద్గిరిగుట్టలో స్థానికంగా ఆందోళన నెలకొంది. బుధవారం రాత్రి నార్సింగి రక్తమైసమ్మ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై దోపిడి దొంగ దాడి చేశాడు. కిశోర్‌ అనే వ్యక్తి.. మహిళపై తల్వార్‌తో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలతో కిశోర్‌ మృతి చెందాడు. గాయాలతో తప్పించుకుని పరిగెత్తిన మహిళను.. దుండగుడు వెంటపడి పట్టుకుని చేతివేళ్లు కోసేశాడు. ఆమె వద్ద నుంచి రూ.15 వేల రూపాయలు లాక్కుని పరారయ్యాడు.

ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. నిందితుడు జగద్గిరిగుట్టలో ఉన్న విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కరణ్​సింగ్ తల్వార్​తో వారిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాజును ఛాతిలో కత్తితో పొడిచాడు. విజయ్‌ అనే మరో కానిస్టేబుల్‌ను తలపై కొట్టాడు. రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు కానిస్టేబుళ్లను. కూకట్‌పల్లి ఆస్పుపత్రి నుంచి మాదాపూర్‌ మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తల్వార్​ను స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Jan 5, 2023, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details