attack with knife నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శనివారం రాత్రి కత్తి పోట్ల ఘటన కలకలం రేపింది. మద్యం మత్తుతో ఓ యువకుడు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. స్థానిక రెస్టారెంట్లో మద్యం తాగేందుకు అనుమతి లేదని నిర్వాహకులు వారించడంతో దారుణానికి ఒడిగట్టాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
attack with knife: తాగేందుకు అనుమతించలేదని కత్తితో వీరంగం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - కత్తితో దాడి
attack with knife: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తాగేందుకు రెస్టారెంట్లో అనుమతి ఇవ్వలేదని బీభత్సం సృష్టించాడు. రోడ్డుపైనే ఉన్న మరో వ్యక్తిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
![attack with knife: తాగేందుకు అనుమతించలేదని కత్తితో వీరంగం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు attack with knife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14014732-994-14014732-1640514142089.jpg)
attack at armoor: రాజారామ్నగర్కు చెందిన లకన్ అనే యువకుడు తాగిన మత్తులో ప్రఫుల్ అనే వ్యక్తిని పొడిచేశాడు. మొదట అతను స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో మద్యం తాగేందుకు యత్నించాడు. నిర్వాహకులు అనుమతి నిరాకరించడంతో వీరంగం సృష్టించాడు. రోడ్డుపైకి వచ్చి చేతిలో ఉన్న కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. కత్తి పోట్లకు గురైన ప్రఫుల్ని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రఫుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవీ చూడండి: