కర్ణాటకలోని మంగళూరులో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని కన్నూర్కు చెందిన నీనా(21).. మంగళూరులోని కొలాసో కాలేజీలో నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది.
suicide: హాస్టల్‌లోని స్నానాల గదిలో ఉరివేసుకున్న నర్సింగ్ విద్యార్థిని - ఉరివేసుకున్న నర్సింగ్ విద్యార్థిని
హాస్టల్‌లోని స్నానాల గదిలో సోమవారం రాత్రి ఓ నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుంది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరు నగరంలో జరిగింది.
nursing student suicide
ఆమె సోమవారం రాత్రి తన హాస్టల్‌లోని స్నానాల గదిలో ఉరివేసుకుని కనిపించింది. గమనించిన తోటివారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. ఫీజు విషయమై కాలేజీ యాజమాన్యం నీనాపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:hyderabad rape case: హైదరాబాద్‌లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం