హైదరాబాద్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఓ బాలిక(9) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనుమానాస్పద స్థితిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి - సైదాబాద్ పోలీస్ స్టేషన్
బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన.. హైదరాబాద్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
తొమ్మిదేళ్ల బాలిక మృతి
ఖాజాబాగ్లో నివాసముంటున్న నేనావత్ సేవ్య, జ్యోతి దంపతులకు ముగ్గురు సంతానం. ఈ నెల 23వ తేదీన.. పిల్లలను ఇంట్లో ఉంచి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన సేవ్య.. పెద్ద కుమార్తె శ్రీనిధి చనిపోయి ఉండటం గమనించి గుండెలవిసేలా రోదించాడు. తండ్రి ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి:నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Last Updated : Mar 28, 2021, 4:44 PM IST