తెలంగాణ

telangana

ETV Bharat / crime

Drugs: మాల్ వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు - డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్ట్​

హైదరాబాద్​ పంజాగుట్టలోని ఓ ప్రముఖ మాల్​ వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఓ నైజీరియన్​ను టాస్క్​పోర్స్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నాలుగు గ్రాముల కొకైన్, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

A nigerian arrested at mall in panjagutta
డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు

By

Published : Oct 3, 2021, 6:54 PM IST

హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ ప్రముఖ మాల్‌ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణ మండల టాస్క్ ఫోర్స్, పంజాగుట్ట పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు. నైజీరియన్‌ నుంచి నాలుగు గ్రాముల కొకైన్, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

2014లో స్టూడెంట్ వీసాపై హైదరాబాద్‌కి వచ్చిన నైజీరియన్‌ డానియల్ ఒలేరియా జోసఫ్ కూకట్‌పల్లిలో ఓ కళాశాలలో చదువుతున్నాడు. దిల్లీకి చెందిన నైజీరియన్ జాన్ పాల్ తో కలిసి జోసఫ్ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జోసఫ్‌ను లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. బెయిల్‌పై విడుదలైన జోసఫ్ మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. గ్రాము కొకైన్‌ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జాన్ పాల్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:డ్రగ్స్​ దందాలో 'సింగం' నటుడు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details