హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాక విద్యుత్ శ్మశానవాటిక వెనుక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేశారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కాచిగూడలో దారుణం.. గ్రానైట్ రాయితో మోది హత్య! - తెలంగాణ వార్తలు
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు రాయితో మోది హతమార్చారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

కాచిగూడలో హత్య, రాయితో మోది
ఘటనా స్థలానికి చేరుకున్న కాచిగూడ పోలీసులు... గుర్తు తెలియని వ్యక్తులు తలపై గ్రానైట్ రాయితో మోది హతమార్చినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపారు.
ఇదీ చదవండి:ఏటీఎం వద్ద కాల్పుల కేసులో ఒకరు అరెస్ట్.. ఇంకొకరు పరార్!