కన్న కొడుకుకు ఎలాంటివాడైనా చిన్న దెబ్బ తగిలితే అమ్మ ప్రాణం తల్లిడిల్లి పోతుంది. ఏమైందో అని క్షణాల్లో పరుగెడుతూ వచ్చి అక్కున చేర్చుకుంటుది. అమ్మ ప్రేమను మించి మరొకటి ప్రపంచంలో లేదన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆ అమ్మే తన గుండెను రాయిలా మార్చుకుంది. దివ్యాంగుడై పుట్టిన కుమారుడి పట్ల మానవత్వం మరిచిపోయి ప్రవర్తించింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ తల్లి చేసిందేమో కానీ.. విన్న మనకే మనసులో బాధ కలుగుతుంటే ఆ కన్నతల్లి ఎంత భారంతో ఆ పని చేసిందో. కన్నకొడుకును సాగర్ ఎడమకాలువలో తోసేసింది. ఈ అమానవీయ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
మానవత్వం మరచిన తల్లి.. దివ్యాంగుడైన కుమారుడిని..! - సాగర్ ఎడమ కాలువ
నాకే కళ్లు ఉంటే అడిగేవాడేని అమ్మా.. ఎందుకు నన్ను నీళ్లలో తోసేస్తున్నావని. నాకే మతిస్తిమితం సరిగ్గా ఉండుంటే అడిగేవాడేని.. ఇలా జన్మించడం నా తప్పా అని. ఇది వినైనా మా అమ్మ మనసు కరిగేదేమో. కానీ ఇక్కడ అదేం జరగలేదు. మా అమ్మ మనసు కరగలేదు. విధి రాసినా నాటకంలో నాతో పాటు ఆమె కూడా ఓ పాత్రధారే కదా. అందుకేనేమో కన్న కొడుకునైనా నాపై కరునించలేదు. పరిస్థితుల ప్రభావమో ఏమో.. ఆర్థిక ప్రభావమో తెలియదు. కానీ మా అమ్మ మానవత్వం మరచిపోయినట్లుగా అనిపించింది. నేను దివ్యాంగుడన్న ఒకే ఒక్క కారణంతో వదిలించుకోవాలనుకుందేమో.. అందుకే ఇవాళ నన్ను కాలువలో తోసి చేతులు దులుపేసుకుంది. వినే వారికి అయ్యోపాపం అనిపించినా మా అమ్మ ఇవాళ చేసిందిదే.
పోషణ భారమై..
నల్గొండలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నల్ల గంతుల శైలజ అనే మహిళ తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. దీంతో ఇళ్లలో పనులు చేస్తూ తన ముగ్గురు కుమారులను పోషిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా.. చిన్న కుమారుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. రెండో కుమారుడైన గోపీచంద్ (14) పుట్టుకతోనే అంధుడు, మతిస్తిమితం లేకుండా ఉన్నాడు. దీంతో శైలజకు అతని బాగోగులు చూసుకునే పరిస్థితి లేక.. పోషణ భారమై బతుకు సాగిస్తోంది. ఇక తప్పని పరిస్థితుల్లో వేములపల్లి వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువలోకి ఆ దివ్యాంగ బాలుడిని తోసేసింది. అది గమనించిన స్థానికులు బాలుని కాపాడే ప్రయత్నం చేశారు కానీ బాలుడు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బాలుడి తల్లి శైలజను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: