తెలంగాణ

telangana

ETV Bharat / crime

కడచూపు కోసం.. కన్నపేగు తల్లడిల్లుతోంది! - విదేశాల్లో మరణించిన వారి చివరి చూపు

విదేశాల్లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన తన కుమారుడిని.. కడసారి కళ్లారా చూసుకునే అవకాశాన్ని కల్పించాలంటూ ఓ తల్లి.. తల్లడిల్లిపోతోంది. కుటుంబం కోసం సొంతూరు విడిచెళ్లిన తన భర్త చివరి చూపునైనా తమకు దక్కించాలని వేడుకొంటూ.. అతని భార్య కన్నీటి పర్యంతమవుతోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి.. అనారోగ్యంతో మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

A mother requested the govt to give a chance to see her son who died five days ago in abroad
కడసారి చూపుకోసం.. కన్నపేగు తల్లడిల్లుతోంది

By

Published : Mar 16, 2021, 5:23 PM IST

గల్ఫ్ ​దేశానికి వెళ్లి అనారోగ్యంతో మృతి చెందిన తన కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి పంపించండంటూ.. ఓ తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఇది జరిగింది.

మన్మద్‌ గ్రామానికి చెందిన కంబోలి రాములు(36) ఉపాధి కోసం.. రెండెళ్ల క్రితం అబుదాబి వెళ్లాడు. సంవంత్సరం క్రితం వరకూ.. ప్రతీ నెల కుటుంబానికి డబ్బులు పంపేవాడు. కొవిడ్ కారణంగా ఉపాధి దొరకక ఏడాది నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

ఛాతి నొప్పితో కొద్ది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన రాములు.. 11వ తేదీన చికిత్స పొందుతూ మరణించినట్లు.. తోటివారు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు 5 రోజులుగా గుండెలవిసేలా రోదిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:దారుణం: భార్యను బండకేసి బాదాడు... తానూ ఉరేసుకున్నాడు!

ABOUT THE AUTHOR

...view details