తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇద్దరు కుమారులతో కలిసి ఉరివేసుకుని తల్లి ఆత్మహత్య - ap news

Mother Committed Suicide Along With Her Two Sons: ఆంధ్రప్రదేశ్​లోని నరసరావుపేటలో భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటుగా ఇద్దరు కుమారులకు ఉరివేసి మరణించింది.

By

Published : Feb 6, 2023, 10:12 PM IST

Mother Committed Suicide Along With Her Two Sons: ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పెద్దచెరువులో మహాలక్ష్మీ నగర్‌లో ఇద్దరు కుమారులతో సహా తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కరరావు తెలిపారు. తల్లి దొండేటి శివలింగేశ్వరి(27), కుమారులు చరణ్‌సాయిరెడ్డి (8), జతిన్‌రెడ్డి(4) మృతి చెందినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

"భార్యా భర్తల మధ్య కొన్ని మనస్పర్థలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని భార్యను కొట్టేవాడు. అదే క్రమంలో ఈరోజు కూడా అలాగే కొట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేక.. అత్తా మామ బయటకి వెళ్లినప్పుడు.. ఇద్దరి పిల్లలకు ఉరి వేసి.. తను కూడా చనిపోయింది. బయట నుంచి వచ్చిన మామ చూసి.. సమాచారం ఇచ్చారు. దీనిపై తదుపరి దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియజేస్తాం". - విజయభాస్కరరావు, నరసరావుపేట డీఎస్పీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details