తెలంగాణ

telangana

ETV Bharat / crime

అమ్మతో గొడవ.. అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా బాలికపై సామూహిక అత్యాచారం - rape on minor girl

హైదరాబాద్​లో మరో దారుణం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ బాలిక ఘటన మరవకముందే మరో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన పాతబస్తీలో చోటుచేసుకుంది. ఈనెల 18న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది.

A MINOR GIRL RAPED IN OLDCITY AREA IN HYDERABAD
A MINOR GIRL RAPED IN OLDCITY AREA IN HYDERABAD

By

Published : Jun 21, 2022, 3:26 PM IST

అమ్మతో గొడవపడి అమ్మమ్మ ఇంటికి వెళుతూ దారితప్పిన ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పోలీసు స్టేషను పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతంలో బాలిక స్టేట్‌మెంట్ ప్రకారం ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది... చాంద్రాయణగుట్ట గుల్షన్‌-ఎ-ఎక్బాల్‌ కాలనీకి చెందిన బాలిక(14) ఈనెల 18న చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌కాలనిలో తన అమ్మమ్మ ఇంటికని బయలుదేరింది. అక్కడికి చేరుకోకపోవడం, బాలిక ఆచూకీ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు.. చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. 19వ తేదీ ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన బాలిక.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘాజిమిల్లత్‌కాలని, హఫీజ్‌బాబానగర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను ఈనెల 18న బైకుపై ఎటో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఒకరోజంతా బాలికను బంధించినట్లు తెలుస్తోంది. బాలిక చెప్పిన వివరాల మేరకు పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయమై పోలీసు అధికారులను సంప్రదించగా దర్యాప్తు కొనసాగుతోందంటూ వివరాలు చెప్పడానికి నిరాకరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details