రాజధానిలో మరో దారుణం... బాలికపై సామూహిక అత్యాచారం - HYDERABAD RAPE CASE
14:49 June 23
బాలికపై సామూహిక అత్యాచారం
రాష్ట్ర రాజధానిలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ ఘటన మరవక ముందే రోజుకో దారుణం బయటకు వస్తోంది. హైదరాబాద్ ఛత్రినాక పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలిక వయసు 17 సంవత్సరాలు. ఆ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసుల వివరాల ప్రకారం తెలుస్తోంది.
ఇదీ జరిగింది...అలీ అనే యువకుడితో ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధిత బాలికకు పరిచయముంది. బాలికను ఇంటికి పిలిచి స్నేహితుడు అర్బాస్‌తో కలిసి అలీ అత్యాచారం చేశాడు. ఈ విషయంపై బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపించి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అలీ, అర్బాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరు బాధిత బాలిక బంధువుగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి :