తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape attempt: మైనర్​ బాలికపై ఓ యజమాని అత్యాచారం - హైదరాబాద్​ మలక్‌పేట

ఓ మైనర్​ బాలికకు 54 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి(Rape attempt) పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సైదాబాద్ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు బాధిత బాలిక తల్లిదండ్రులు సైదాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిని కఠినంగా శిక్షించాలని కోరారు.

A minor girl is raped by an employer
Rape attempt: మైనర్​ బాలికపై ఓ యజమాని అత్యాచారం

By

Published : May 30, 2021, 5:27 PM IST

హైదరాబాద్ సైదాబాద్ పోలీస్​ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఏకలవ్యనగర్‌లో ఓ 14 ఏళ్ల గిరిజన బాలికపై 54 ఏళ్ల వయసున్న ఓ బెల్ట్‌షాపు యాజమాని అత్యాచారానికి (Rape attempt) ఒడిగట్టాడు.

ఆరో తరగతి చదువుతున్న బాధిత బాలికను జనార్దన్ అనే బెల్ట్‌ షాపు యాజమాని… మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడని… బాధిత బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాలిక కుటుంబ సభ్యులు గిరిజన సంఘాల నేతలతో కలిసి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మలక్‌పేటలోని మండిలో హమాలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని… తాము పనులకు వెళ్లిన సమయంలో తమ కూతురిపై అఘాయిత్యానికి(Rape attempt) పాల్పడ్డాడని బాలిక తల్లి తెలిపింది. అత్యాచారానికి పాల్పడ్డ జనార్దన్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details