minor girl suicide: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక స్ఫూర్తి ఫౌండేషన్‌లో ఓ మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలికకు చిన్నతనంలోనే తండ్రి దూరం కాగా.. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. అప్పటి నుంచి బాలిక తన అక్కతో కలిసి దుండిగల్‌లోని స్ఫూర్తి ఫౌండేషన్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుకుంటోంది.
తోటి విద్యార్థులు హేళన చేశారని ఆరో తరగతి బాలిక ఆత్మహత్య - minor girl suicide in dundigal
minor girl suicide: తోటి విద్యార్థులు హేళన చేశారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల బాలిక 15 రోజుల పాటు తన స్వస్థలానికి వెళ్లి.. తిరిగి ఫౌండేషన్‌కు చేరుకుంది. అనంతరం ఇక్కడ ఉండటం ఇష్టం లేక మళ్లీ ఇంటికి వెళ్లాలనుకుంది. విషయం తెలిసిన తోటి విద్యార్థులు బాలికను హేళన చేశారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు విషయం తెలుసుకున్న తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ప్రతినిధులు ఫౌండేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. చనిపోయిన విద్యార్థిని ఒంటిపై గాయాలున్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు.