తను ప్రేమించిన యువతిని.. తనకు దూరం చేస్తున్నారంటూ ఓ మైనర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జంగపల్లికి చెందిన మైనర్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు.. వారి వివాహానికి అంగీకరించలేదు.
'పెళ్లి చేయండి.. లేదంటే సెల్‌టవర్ పైనుంచి దూకి చనిపోతా..!' - కరీంనగర్ జిల్లా
కోరుకున్న అమ్మాయి తనకు దక్కదేమోనని మనస్తాపం చెందాడు ఓ మైనర్ ప్రేమికుడు. సెల్ టవర్ ఎక్కి.. దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
'పెళ్లి చేయండి.. లేదంటే సెల్‌టవర్ పైనుంచి దూకి చనిపోతా..!'
మనస్తాపానికి గురైన అబ్బాయి సెల్ టవర్ ఎక్కి.. దూకేస్తానంటూ హల్చల్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మేజర్ అయితే తామే దగ్గరుండి వివాహం జరిపించేవారిమని వివరించారు. సాయంత్రం దాకా నానా హైరానా చేసిన ప్రేమికుడు.. ఎట్టకేలకు దిగి వచ్చాడు. ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఇదీ చదవండి:పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ