రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌లోని సుందరయ్య కాలనీకి చెందిన రమావత్ కవిత(21) ఈ నెల 18న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్య కరోనాతో మృతి చెందిందని.. భర్త విజయ్ మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. కూతురు అంత్యక్రియలు జరిపిన వారం రోజుల తర్వాత కవిత మృతిపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో కూతురికి టెస్ట్ చేయించిన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో వారు ఎంక్వైరీ చేయగా నెగెటివ్ అని తేలింది.
'కరోనా మరణంగా చిత్రీకరించాడు'
మృతురాలి రిపోర్ట్‌లో నెగెటివ్ అని ఉండటంతో.. అల్లుడే తమ కూతురిని హత్య చేసి కరోనాతో మృతి చెందినట్లు చిత్రీకరించాడని కవిత తల్లిదండ్రులు ఆరోపించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి స్వగ్రామమైన నల్గొండ జిల్లా పిల్లగుంట్ల తండాలో.. మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం చేయించారు. ఆ వచ్చే నివేదికను బట్టి మృతికి గల అసలు కారణాలు తెలియనున్నాయి.
ఇదీ చదవండి:Acb: కల్యాణలక్ష్మి కాసుల కోసం కక్కుర్తి... ఏసీబీ చేతికి చిక్కి..