తెలంగాణ

telangana

ETV Bharat / crime

నాకు మీరే న్యాయం చేయాలి సార్‌.. పోలీసులను ఆశ్రయించిన మహిళ

A man who cheated a woman in Hyderabad: ఇద్దరి మహిళలను పెళ్లి చేసుకొని వారికి విడాకులు ఇచ్చి ఇంకో మహిళను పెళ్లి చేసుకుని ఆమెను హింసించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బాధితురాలు వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

A man who cheated a woman in Hyderabad
హైదరాబాద్‌లో మహిళను మోసం చేసిన వ్యక్తి

By

Published : Jan 29, 2023, 3:05 PM IST

A man who cheated a woman in Hyderabad: హైదరాబాద్​లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం బయటపడ్డది. రెండు పెళ్లిళ్లు చేసుకొని, మరో మహిళను ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పడు తనకి సంబంధం లేదని ఆ మహిళను మానసికంగా, శారీరకంగా బాధ పెడుతున్న ఘటన సికింద్రాబాద్‌లోని బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితురాలి వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకి చెందిన ఓ మహిళకు బోయినపల్లికి చెందిన వంశీకృష్ణ మాట్రిమొనీ ద్వారా పరిచమయ్యాడు. వారిద్దరూ 15 రోజుల పాటు సహజీవనం చేశారు.

బాధితురాలు

అనంతరం ఎవరికీ తెలియకుండా నెల్లూరులోనే వివాహం చేసుకున్నారు. తరవాత అతను ఆమెను తన ఇంటికి తీసుకొచ్చి వారి బంధువులకు పరిచయం చేశాడు. కొన్ని రోజుల తరవాత వంశీ ప్రవర్తన మారిపోయింది. రోజూ తనను కుటుంబ సభ్యులతో కలిసి వేధిస్తున్నట్లు తెలిపింది. గృహ నిర్బంధం చేసి హింసించారని చెప్పింది. తన ఆస్తి కోసం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టారని వాపోయింది.

తీరా అతని గురించి వివరాలు ఆరా తీస్తే ఇది వరకే రెండు పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులు ఇచ్చినట్లు తెలిసిందని చెప్పింది. ఇప్పుడు తనని పెళ్లి చేసుకుని కాపురానికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనను కేవలం ఆస్తి కోసం పెళ్లి చేసుకొని గృహ హింసకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనకు న్యాయం చేయాలని లేని పక్షంలో భర్త ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.

"నాకు వంశీ అనే అతను మ్యాట్రీ మొనీ వెబ్‌సైట్‌ ద్వారా పరిచమయ్యాడు. మేమిద్దరం నెల్లూరులో రహాస్యంగా పెళ్లి చేసుకున్నాం . కొన్ని రోజుల తరువాత హైదరాబాద్‌ వచ్చాం. వారి బంధువుల అందరికి పరిచయం చేశాడు. నెమ్మదిగా నన్ను శారీరకంగా అతను, అతని కుటుంబ సభ్యులు హింసించే వారు. వారం రోజులు నన్ను ఇంట్లోనే ఉంచి కనీసం భోజనం కూడా పెట్టలేదు. అతనికి ఇది వరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయన్న విషయం హైదరాబాద్‌ వచ్చాకే తెలిసింది. నన్ను శారీరకంగా , మానసికంగా చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే పోలీసులను అశ్రయించాను. నాకు ఎలాగైనా న్యాయం చేయాలి. లేదంటే అతని ముందే ఆత్మహత్య చేసుకుంటాను." - బాధితురాలు

ఇవీ చదవండి:


బాధితురాలు

ABOUT THE AUTHOR

...view details