తెలంగాణ

telangana

ETV Bharat / crime

Covid crisis: కుటుంబ పోషణ భారమై వ్యక్తి ఆత్మహత్య - కుటుంబ పోషణ భారమై

సామాన్యుల బతుకుల్లో కరోనా మహమ్మారి.. కల్లోలం సృష్టిస్తోంది. ఓ వైపు వైరస్‌ భయం వణికిస్తుండగా.. మరోవైపు లాక్​డౌన్​తో పనులు లేక, పూట గడవక చిరు ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. నెలల తరబడి జీతాలు లేక బతుకు భారమై.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాగే నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ పోషణ భారమై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

man commits suicide
వ్యక్తి ఆత్మహత్య

By

Published : May 31, 2021, 10:44 PM IST

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి.. కుటుంబ పోషణ భారమై పురుగుల మందు తాగి బలవన్మరణాలకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన.. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన నవీన్ కుమార్(30) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బస్ డ్రైవర్​గా పని చేసేవాడు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో పాఠశాల మూతపడటంతో మూడు నెలలుగా జీతాలు లేక.. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పట్టణంలో పూట గడవక.. సొంతూరుకు మకాం మార్చాడు.

నమ్ముకున్న వ్యవసాయం కూడా..

నవీన్ కుమార్.. తనకున్న రెండున్నర ఎకరాల్లో పంట సాగు చేశాడు. దురదృష్టవశాత్తు పంటకు తెగులు పట్టి.. దిగుబడి రాలేదు. దీంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. జీవితం మీద విరక్తి చెంది.. పురుగుల మందు తాగి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఆరు నెలల క్రితమే పెళ్లైనట్లు అతడి తల్లి చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:వీడియో వైరల్: సింగిల్ విండో ఛైర్మన్ లంచం డిమాండ్

ABOUT THE AUTHOR

...view details