మాయమాటలు చెప్పి బాలికను వివాహం చేసుకొని అత్యాచారం చేసిన మూడు పెళ్లిళ్ల ప్రబుద్ధుడిని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని సద్దలగుండుకు చెందిన ఎండి సాజిద్ గతంలో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వారివురి మధ్య గొడవలు తలెత్తడంతో మూడో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక సంతానం కలిగింది. జీవనోపాధి కోసం భార్యతో కలిసి దేవరకద్ర మండలం చౌదర్పల్లిలో కూలీపనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ సమయంలో ఓ బాలికతో సాజిద్‌కు పరిచయం ఏర్పడింది. దాంతో ఆమెతో చనువు పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
పథకం వేసి..