తెలంగాణ

telangana

ETV Bharat / crime

Mystery death: ఆస్పత్రి నుంచి పరారై.. చెట్ల పొదల్లో శవమై తేలాడు - మిస్సింగ్ కేసులు

భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాలలో విషాదం చోటు చేసుకుంది. మిస్సింగ్​గా నమోదైన ఓ కేసు.. మిస్టరీ మరణంగా మారింది. ఆసుపత్రి నుంచి పరారైన ఓ వ్యక్తి.. చెట్ల పొదల్లో శవంగా తేలాడు. అసలేం జరిగిందంటే..?

Mystery death
మిస్టరీ మరణం

By

Published : Jun 29, 2021, 10:46 PM IST

ఆసుపత్రి నుంచి పరారైన ఓ వ్యక్తి.. చెట్ల పొదల్లో శవంగా తేలాడు. ఈ అనుమానాస్పద ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలంలో చోటు చేసుకుంది. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తికి వైద్యం చేయించినప్పటికీ.. చివరకు తాను అనుకున్న విధంగానే జీవితాన్ని ముగించాడంటూ బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

అసలేం జరిగిందంటే..?

మామిడి గుండాలకు చెందిన ముక్తి వెంకటేశ్వర్లు ఈనెల 24వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు.. మరుసటి రోజు తెల్లవారు జామున ఎవరి కంట పడకుండా ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.

మిస్సింగ్ కేసుగా నమోదు..

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చెట్ల పొదల్లో శవమై..

బాధితుడు కనిపించకుండా పోయిన నాలుగు రోజుల అనంతరం.. ఇల్లందు సింగరేణి బైపాస్ రోడ్డు మార్గంలోని చెట్ల పొదల్లో పోలీసులకు అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకున్న ఓ వ్యక్తి మృతదేహం లభించింది. విచారణలో అది మిస్సింగ్ కేసుగా నమోదైన వెంకటేశ్వర్లు మృతదేహమేనని తేలింది. దీంతో వారు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మానసిక స్థితి సరిగా లేక..

బంధువులు, స్థానికుల సమాచారంతో మానసిక స్థితి సరిగా లేని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగి నాలుగు రోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయింది.

ఇదీ చదవండి:అటవీ భూముల రగడ.. పోలీసుల రంగప్రవేశం!

ABOUT THE AUTHOR

...view details