తెలుగు సినీ గాయని పేరుతో సామాజిక మాధ్యమాల్లో(social media) నకిలీ ఖాతాలు(fake accounts) తెరిచి లబ్ధి పొందేందుకు యత్నించిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు(rachakonda cyber crime police) అరెస్ట్ చేశారు. కర్నాటకలోని అత్తిబెలి మండలం నారాలూరుకు చెందిన నవీన్ లఘు చిత్రాల డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. ఓ తెలుగు సినీ గాయని(telugu singer) ఇంటర్వ్యూని చూసి ఆమె అభిమానిగా మారాడు. అనంతరం ఆమె ఫొటోలు సేకరించి... గాయని పేరుతో ఫేస్ బుక్(facebook), ఇన్‌స్టా గ్రామ్(instagram), యూట్యూబ్ ఛానెల్(you tube), ట్విటర్(twitter) ఖాతాలు తెరిచాడు.
గాయనికి తెలియకుండా ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి, పలు వెబ్ సిరీస్‌లు, ఆల్బమ్‌లు, పాటలు, లఘు చిత్రాల(short films)ను అప్ లోడ్ చేశాడు. ఓ చిత్రాన్ని నిర్మించేందుకు యత్నించగా... ఈ విషయం తెలుసుకున్న ఆ గాయని ఆ ఖాతాలను తొలగించాల్సిందిగా నవీన్‌ను కోరారు. కానీ అందుకు అతడు నిరాకరించాడు.