కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో.. ఓ వ్యక్తి మృతదేహాన్ని ఊర పందులు పీక్కు తింటుండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ శశాంక్ రెడ్డి మృతదేహాన్ని పరిశీలించి పట్టణానికి చెందిన షేక్ హైమద్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Suspicious death: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - suspicious deaths
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
murder
మృతుడి భార్య షేక్ నాజియా బేగం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్వేత పేర్కొన్నారు.