తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: రెండు బస్సుల మధ్యలో నలిగి వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్​ గోపాలపురం పోలీస్ స్టేషన్​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. రెండు బస్సుల మధ్యలో నలిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

accident, man dead
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, బస్సు ప్రమాదం

By

Published : Jun 27, 2021, 3:05 PM IST

హైదరాబాద్​ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బస్​ స్టాప్​లో రెండు బస్సుల మధ్య నలిగి ఓ వ్యక్తి మృతి చెందారు. సికింద్రాబాద్​లోని ఓ బస్ స్టాప్​లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఎక్కేందుకు వస్తుండగా... రెండు బస్సుల మధ్య చిక్కి వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

బస్సు రివర్స్ తీసుకుంటున్న క్రమంలో దుర్గారావు అనే వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించేలోపే మృతి చెందారు.

మృతుడు దుర్గారావు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వెంటనే ఫోన్ చేసినా అంబులెన్సు సిబ్బంది సకాలంలో రాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 వాహనం అరగంట ఆలస్యంగా రావడం వల్లే ప్రాణాలు కోల్పోయారని వాపోయారు.

ఇదీ చదవండి:Gutha Sukender Reddy: కేంద్రం అలసత్వంతో నదీ జలాల సమస్య దుర్భరం: గుత్తా

ABOUT THE AUTHOR

...view details