Man Murder in Nizamabad : నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లి గ్రామ శివారులో దారుణం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన వ్యక్తిని చెట్టుకు ఉరి వేసిన దుండగులు.... అనంతరం, నిప్పంటించి తగలబెట్టారు. మృతుడు రామచంద్రపల్లికి చెందిన దొడ్డిండ్ల పోశెట్టిగా గుర్తించారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న పోశెట్టికి... భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.
కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిని.. చెట్టుకు ఉరేసి తగులబెట్టారు.. - నిజామాబాద్‌లో వ్యక్తి హత్య
Man Murder in Nizamabad : భూ వివాదం గురించి ఇవాళ కోర్టుకు వెళ్లాల్సిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు ఓ చెట్టుకు ఉరివేశారు. అంతటితో ఆగకుండా నిప్పంటించి తగులబెట్టారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రామచంద్రపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Man Murder in Nizamabad
ఆర్థిక పరమైన తగాదాలతో పాటు భూవివాదాల్లో పోశెట్టి ఉన్నాడని.... ఇదే విషయమై ఇవాళ కోర్టుకు వెళ్లాల్సి ఉన్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు.... విచారణ చేపట్టారు. నలుగురు వ్యక్తులపై అనుమానం ఉందన్న ఫిర్యాదుతో గాలింపు చేపట్టారు.