Murder: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై డీజల్ పోసి అతికిరతకంగా హత్య చేశారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కలువాయి మండలం వెరుబోట్లపల్లి సమీపంలోని తెలుగు గంగ కాలువ వద్ద ఓ వ్యక్తిని డిజిల్ పోసి కాల్చివేసినట్లు మృతదేహాన్ని చూస్తే తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కలువాయి ఎస్ఐ ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు ఆరా తీశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరులో దారుణం.. వ్యక్తిపై డీజిల్ పోసి తగులబెట్టిన దుండగులు - నెల్లూరులో ఓ వ్యక్తి దారుణ హత్య
Murder: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కలువాయి వెరుబొట్లపల్లిలో దారుణహత్య జరిగింది. ఓ వ్యక్తిపై డీజిల్ పోసి దుండగులు హత్య చేశారు. తెలుగుగంగ కాలువ వద్ద మృతదేహం లభ్యమయింది. పోలీసులు ఘటనా స్థలాన్నిపరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నెల్లూరులో దారుణం
"మృతి చెందిన వ్యక్తి ఆనవాలు తెలియలేదు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా ఆ వ్యక్తి 5 అడుగుల 2 అంగుళాలు ఉంటాడు. గళ్ల లుంగి, తెల్ల కాటన్ చొక్క ధరించాడు. ఈ ఆనవాలు తెలిసిన వ్యక్తులు ఎవరైనా సమాచారం ఇవ్వండి." - ప్రభాకర్ ,ఎస్ఐ
ఇవీ చదవండి:
Last Updated : Dec 17, 2022, 8:11 PM IST