తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణ హత్య - తెలంగాణ వార్తలు

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం దుండగులు పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.

a man was brutally murdered  in Mahabubnagar district judcharla
కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణ హత్య

By

Published : Mar 20, 2021, 5:07 AM IST

కుటుంబ కలహాలతో సయ్యద్ మౌలానా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్లలో జాతీయ రహదారి పక్కన ఆర్​అండ్​బీ అతిథి గృహం సమీపంలో జరిగింది. మృతుడి పెద్ద భార్య కుమారుడు, మేనల్లుడు కలిసి కత్తితో గొంతు కోసి చంపారు. అనంతరం పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.

జడ్చర్లలోని కావేరమ్మపేటలో నివాసముండే మౌలానా రియల్‌ ఎస్టేట్​ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య గోదావరిఖని నివాసి. కొన్ని ఏళ్ల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలతో విడిపోయారు. మౌలానా మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారుడు సయ్యద్ ఇబ్రహీం హైదరాబాద్​లో ఉంటూ ఇటీవల జడ్చర్లకు వచ్చి ఒక హోటల్ వద్ద పని చేస్తున్నాడు. అతడికి మౌలానా సోదరి కొడుకుతో స్నేహం ఏర్పడింది.

అతడు ఇల్లు అతని సోదరులు దగ్గరే ఉండడంతో మౌలానా మొదటి భార్య కొడుకు తరచూ ఇంటి దగ్గరకు వస్తుండడంతో అతనితో స్నేహం చేయొద్దని మౌలానా పలుమార్లు వారించాడు. ఇంటి విషయంలో కూడా తగాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహం వద్ద మాట్లాడేందుకు వచ్చి మాటా మాటా పెరగడంతో వివాదం హత్యకు దారి తీసింది.

ఇదీ చదవండి:నడిరోడ్డుపై కత్తితో దాడి.. ఆపై పరారీ..!

ABOUT THE AUTHOR

...view details