హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నందమూరి నగర్లో నివాసం ఉండే సునీల్ బుధవారం ఉదయం ఇంటి ముందు కిందపడి ఉండగా... శరీరంపై గాయాలను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సునీల్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు.
జవహర్‌నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి - తెలంగాణ వార్తలు
జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఒంటిపై గాయాలతో సునీల్ అనే వ్యక్తి ఇంటి ముందే పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని మృతుడి సోదరుడు ఆరోపించారు.
జవహర్‌నగర్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
ఈ ఘటనపై తమకు అనుమానం ఉందని... పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మృతుడి సోదరుడు కోరారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై హత్యాయత్నం