మేడ్చల్ జిల్లా సురారం కాలనీ మైత్రినగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కూలీపని చేసుకునే నరసింహ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న నరసింహ... రాత్రి అకస్మాత్తుగా మృతి చెందడంపై మృతిని తరఫు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే కల్లు, మద్యానికి బానిసై... అనారోగ్యంతోనే మరణించాడని భార్య తెలిపింది.
సూరారంకాలనీలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - తెలంగాణ తాజా వార్తలు
నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారం కాలనీలో జరిగింది.
man suspect death
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని పలుకోణాల్లో విచారిస్తున్నారు.
ఇదీ చూడండి:తండ్రిని గడ్డపారతో కొట్టి చంపిన కొడుకు