తెలంగాణ

telangana

ETV Bharat / crime

డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం - telangana latest news

రోజూ పని చేస్తున్నా.. కూలీ డబ్బులు రావడం లేదు. పైసలు లేక తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. వీటన్నింటితో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి.. మద్యం సేవించి విద్యుత్​ స్తంభం ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్​చల్​ చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో జరిగింది.

a man suicide attempt in mulugu district
డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 13, 2021, 1:20 PM IST

డబ్బులు రాక.. ఇంట్లోపోరు పడలేక.. ఆత్మహత్యాయత్నం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఓ సంస్థలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో గత 6 నెలలుగా యాజమాన్యం వేతనాలు ఇవ్వడం లేదు. ఫలితంగా తరచూ ఇంట్లో భార్యతో గొడవలు జరుగున్నాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన సాబీర్.. మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంట్​ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

సాబీర్​ సుమారు గంట పాటు స్తంభంపై హల్​చల్ చేశాడు. స్థానికులు ఎంతనచ్చజెప్పినా వినలేదు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేశారు. అతడికి నచ్చజెప్పి కిందకు దింపారు. కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు.

ఇదీ చూడండి: వ్యక్తి సజీవదహనం.. ప్రమాదమా లేక హత్యా ..?

ABOUT THE AUTHOR

...view details