Selfie Suicide Attempted: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన నక్క అనిల్ తనను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నాడు. అకారణంగా తనపై రౌడీషీట్ తెరిచారని ఆవేదన వ్యక్తంచేశాడు.
దీంతో పురుగులమందు తాగి చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. తన కుటుంబాన్ని వేధింపుల నుంచి రక్షించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్‌ను, జగిత్యాల ఎస్పీలను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీసులు అనిల్ కోసం గాలింపు చేపట్టారు.