తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE ATTEMPT: భాజపా నేత ఇంటి ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం! - తెలంగాణ వార్తలు

కులం పేరుతో దూషించడమే కాకుండా తనపై దాడి చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించారు. భూవివాదం కారణంగా కరీమాబాద్‌కు చెందిన భాజపా నేత మాచర్ల దీన్ దయాల్ కులం పేరుతో దూషించారని బాధితుని కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు.

SUICIDE ATTEMPT, bjp leader land issue
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం, కరీమాబాద్ భాజపా నేత దీన్ దయాల్

By

Published : Aug 3, 2021, 5:00 PM IST

కులం పేరుతో దూషించడమే కాకుండా వ్యక్తిపై దాడి చేసిన ఘటన వరంగల్ నగరంలో వెలుగుచూసింది. వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు మాచర్ల దీన్ దయాల్ తన అనుచరులతో కలిసి రామకృష్ణ అనే వ్యక్తిపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. గాయపడ్డ రామకృష్ణ తనకు న్యాయం చేయాలంటూ దీన్‌ దయాల్ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లగా మరోసారి దుర్భాషలాడారని వాపోయారు. మనస్తాపానికి గురైన రామకృష్ణ పురుగుల మందు తాగి... ఆత్మహత్యకు యత్నించారు. రామకృష్ణను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

దీన్ దయాల్ తండ్రి మాచర్ల సాంబయ్య... తన తల్లికి స్థలం అమ్మారని రామకృష్ణ చెబుతున్నాడు. ఆ భూమికి ఇప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. దీన్ దయాల్ వృత్తిరీత్యా లాయర్, భారతీయ జనతా పార్టీ కీలక నేత కావడంతో అధికారులు ఎవరూ తమ గోడును పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై రామకృష్ణ తల్లి కలెక్టరేట్ వద్ద గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వివరించాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెడితే... దీన్‌ దయాల్, ఆయన కుటుంబ సభ్యులంతా కలిసి 500 గజాల భూమి ఇస్తానని హామీ ఇచ్చారు. మేం రూ.10 లక్షలు పెట్టి అంతా బాగు చేసుకున్నాం. ఇప్పుడేమో భూమి ఇవ్వను అంటూ కులం పేరుతో దూషిస్తున్నారు. అంతేకాకుండా భూమి జోలికి వస్తే చంపుతానని బెదిరిస్తున్నారు. ఈ విషయం అడగడానికి వెళ్తే రామకృష్ణపై దాడి చేశారు. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

-సునీల్, రామకృష్ణ బంధువు

ఇదీ చదవండి:TRAINEE WOMAN SI COMPLAINT: మహిళా ట్రైనీ ఎస్సైని అడవుల్లోకి తీసుకెళ్లి... !

ABOUT THE AUTHOR

...view details