తెలంగాణ

telangana

ETV Bharat / crime

Selfie suicide: నాడు భార్య ఉరేసుకుంటుంటే వీడియో తీశాడు.. నేడు సెల్ఫీ వీడియో తీసుకొని.. - మొద్దు పెంచలయ్య ఆత్మహత్యాయత్నం

Selfie suicide: గతంలో ఇంట్లో భార్య ఉరేసుకొని చనిపోవడాన్ని వీడియో తీస్తూ.. పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి నేడు ఆత్మహత్యకు యత్నించాడు. తాను, తన భార్య చావుకు కొంతమంది కారణమంటూ.. సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో కలకలం రేపుతోంది. ఏపీలోని నెల్లూరులో ఈ ఘటన జరిగింది.

Suicide attempt
Suicide attempt

By

Published : Jan 29, 2022, 10:15 AM IST

Selfie suicide: ఏపీలోని నెల్లూరు జల్లా ఆత్మకూరులో మొద్దు పెంచలయ్య సెల్ఫీ వీడియో కలకలం సృష్టించింది.'నేను, నా భార్య చావుకు కొంతమంది కారణం' అంటూ.. సెల్ఫీ వీడియో పెట్టిన పెంచలయ్య.. అనంతరం భార్య సమాధి వద్దే పురుగులమందు తాగాడు. పరిస్దితి విషమంగా ఉండటంతో స్థానికులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.

గతంలో ఏం జరిగిందంటే..?

మూడు నెలల క్రితం మెప్మాలో రిసోర్స్ పర్సన్​గా పనిచేస్తున్న కొండమ్మ.. ఇంట్లో ప్యాన్​కి ఉరివేసుకొని చనిపోవటాన్ని ఆమె భర్త పెంచలయ్య వీడియో తీశాడు. ఆమె ఉరేసుకుంటుంటే కళ్లప్పగించి చూశాడు. ఎన్ని గొడవలు ఉన్నా.. ప్రాణాలు తీసుకుంటుంటే.. పగవాడైనా కాపాడేందుకు యత్నిస్తాడు. కానీ ఆమె భర్తే ఆమెను ఆపకపోగా... ఏదో ఘనకార్యం చేసినట్లు ఆ ఘటనను వీడియోలో బంధించాడు. అంతేకాకుండా ఆ వీడియోను బంధువులందరికీ పంపి పైశాచిక ఆనందం పొందాడు. ఆ వీడియో అప్పట్లో వైరల్​ అయ్యింది. ఆ ఘటన సంచలనంగా మారింది.

ఆ కేసులో జైలుకి వెళ్లిన పెంచలయ్య ఇటీవల బెయిల్​పై వచ్చాడు. ఇవాళ.. తాను, తన భార్య చావుకు కారణం కొంతమంది కారణమంటూ.. వారి పేర్లును చెబుతూ సెల్పీ వీడియో తీసుకున్నారు. అనంతరం లెటర్​ రాసి భార్య సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదీచూడండి:WIFE SUICIDE VIDEO: కాపాడాల్సిన భర్తే.. మొబైల్​లో వీడియో తీశాడు

ABOUT THE AUTHOR

...view details