తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide attempt at metro: మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - దిల్​సుఖ్​నగర్ మెట్రోస్టేషన్ వద్ద ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్​లో దిల్​సుఖ్​నగర్ మెట్రోస్టేషన్​ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాధితునికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Suicide attempt at metro
మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 30, 2021, 9:16 PM IST

Updated : Sep 30, 2021, 10:18 PM IST

హైదరాబాద్​లో దిల్‌సుఖ్‌నగర్‌ మెట్రోస్టేషన్‌ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్యకు యత్నించాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితుడు ఛత్తీస్‌గఢ్​లోని దంతెవాడకు చెందిన భీమా(45)గా గుర్తించారు.

క్షతగాత్రున్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్య చేసుకునేందుకా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:Husband killed his wife: భార్యను చంపేశాడు.. సహజ మరణంగా చిత్రీకరించాడు!

Last Updated : Sep 30, 2021, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details