తెలంగాణ

telangana

ETV Bharat / crime

సెల్ఫీ వీడియో: గొలుసుకట్టు మోసంతో ఆత్మహత్యాయత్నం - తెలంగాణ లేటెస్ట్​ వార్తలు

గొలుసుకట్టు మోసాలు తగ్గడం లేదు. తాజాగా ఓ యువకుడు గొలుసుకట్టు సంస్థలో చెల్లించిన డబ్బులు సమయానికి రాకపోవటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు జరిగిన మోసాన్ని సెల్ఫీ వీడియో తీసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

suicide attempt
ఆత్మహత్యాయత్నం

By

Published : Apr 14, 2021, 2:58 PM IST

కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన అంజాద్ అనే యువకుడు గోలుసుకట్టు సంస్థలో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఎంత డబ్బులు కడితే అంతకు రెట్టింపు పైసలు వస్తాయని గోలుసుకట్టు సంస్థ ఏజెంట్​ అంజాద్ చెప్పాడు. ఇది నమ్మిన అతను లక్ష 20 వేలు ఏజంట్​కు ఇచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత డబ్బులు ఇవ్వాలని ఏజెంట్ ఇంటి వద్దకు వెళ్తే తనను మెడపట్టి బయటకు గెంటేశారని చెప్పాడు. మనస్తాపం చెందిన అంజాద్ పురుగుల మందు తీసుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి సెల్ఫీ వీడియోలో తన బాధను తెలుపుతూ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వీడియో షేర్ చేశాడు. గ్రామస్థులు అతని కోసం వెతకగా గ్రామంలోని కాకుల గుట్ట తండా శివారులోని గొట్టం చెరువు ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంజాద్​ను వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అంజాద్ చికిత్స పొందుతున్నాడు.

ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:బెల్లంపల్లిలో కరోనా బాధితురాలి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details