suicide attempt at jagadevpur: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వడం లేదని, తనకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని కోరుతూ తీగుల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ యువకుడు పురుగుల మందు తాగి హల్చల్ చేశాడు. అతడిని అడ్డుకున్న తహసీల్దారు యాదగిరిరెడ్డి... యువకుడిని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
suicide attempt at jagadevpur : తహసీల్దారు కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం - జగదేవ్‌పూర్ తహసీల్దారు కార్యాలయం
suicide attempt at jagadevpur: ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఇవ్వడం లేదని, తనకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌లో జరిగింది.
జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన యువకుడు బాలకృష్ణ... వ్యవసాయం చేస్తుంటాడు. తన పొలం పక్కనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలువ నిర్మాణంలో భాగంగా తీసిన మట్టి వలన.. తన పొలంలో నీరు నిలిచిపోతుందని.. అందుకు పరిహారంగా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. పరిహారంగా ఎస్సీ కార్పొరేషన్ కింద రుణం మంజూరు చేయాలని తహసీల్దారు కార్యాలయం చూట్టూ తిరుగుతున్నాడు. ఈ విషయమై మంగళవారం తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన అతడు.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పాడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలకృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:man tries to avoid vaccine: 'వ్యాక్సిన్ వద్దు బాబోయ్..!'.. చెట్టెక్కి యువకుడు హల్చల్