తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide Attempt at BJP office: భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే.. - భాజపా రాష్ట్ర కార్యాలయం

హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు(suicide attempt) యత్నించాడు. తన పిల్లలతో సహా వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు అతన్ని కాపాడి పోలీసులకు సమాచారమిచ్చారు.

http://10.10.50.85:6060/reg-lowres/17-November-2021/tg_hyd_53_17_man_sucide_attempt_at_bjp_office_av_ts10005_1711digital_1637154247_476.mp4
భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 17, 2021, 7:22 PM IST

స్థలం విషయంలో అన్యాయం జరిగిందంటూ మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేశాడు. హైదరాబాద్​లోని భాజపా రాష్ట్ర కార్యాలయం(BJP party office) ఎదుట ఫినాయిల్ తాగి బలవన్మరణానికి (suicide attempt)యత్నించాడు. తనకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగడం లేదంటూ వాపోయారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్​కు చెందిన గొల్లపల్లి రాజు(Gollapalli raju) తన భూమిలో అక్రమంగా కమ్యూనిటీ హాల్ నిర్మించారంటూ ఇద్దరు పిల్లలతో సహా వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు.

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన భూమిలో కమ్యూనిటీ హాల్ నిర్మించారని... ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను(BJP state president bandi sanjay) కలిసేందుకు హైదరాబాద్​కు వచ్చానని తెలిపారు. స్థానిక పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. భాజపా అంటే తనకు అభిమానం అని.. తనకు న్యాయం చేయాలని బండి సంజయ్(BJP state president bandi sanjay) అన్నకు మొరపెట్టుకునేందుకు వచ్చానని గొల్లపల్లి రాజు తెలిపారు.

నన్ను ఊరు మొత్తం కలిసి కొట్టిర్రు. నా స్థలంలో కంచెలు కట్టిర్రు. మహేందర్ రెడ్డిని కలిసినా. ఆఫీసర్లను అందరినీ కలిసినా. నాకు న్యాయం జరగలేదు. నాపై కేసులు పెట్టి నన్ను జైల్లో వేసిండ్రు. నాకు బండి సంజయ్ అన్న న్యాయం చేస్తాడని వచ్చాను సార్. బండి సంజయ్​ను కలిసి నా బాధను చెప్పకుంటా సార్. భాజపా అంటే నాకు చాలా ఇష్టం సార్. -

గొల్లపల్లి రాజు, బాధితుడు

ఇదీ చూడండి:

Sexual Harassment: లైంగికంగా వేధించిన ఏఈకి దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details