తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape attmept: ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. దుకాణానికి వెళ్లిన పాపతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లోబరుచుకోబోయాడు. ఇంతలోనే పాప తండ్రి అక్కడకు చేరుకోవడంతో ఆ నీచుడి దాష్టీకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

sexually harassed
sexually harassed

By

Published : Jul 7, 2021, 9:53 AM IST

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి యత్నించాడు ఓ కామాంధుడు. దుకాణానికి వెళ్లిన ఆ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతలోనే చిన్నారి తండ్రి అక్కడకు చేరుకోవడంతో కామాంధుడి ఘాతుకం బయటపడింది. దీనిపై పాప తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనిలో వెలుగుచూసింది.

పట్టణంలోని నారాయణ గుంతలో చంద్రన్న అనే వ్యక్తి కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఐదేళ్లున్న బాలిక దుకాణం వద్దకు వచ్చింది. అయితే షాపుకి వెళ్లిన బాలిక ఎంత సేపటికీ తిరిగి రాకపోవడం వల్ల ఏమైందోనని ఆ చిన్నారి తండ్రి దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దుకాణం యజమాని చంద్రన్న కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పట్టణ రెండో పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుకాణం యజమానిని అరెస్ట్​ చేశారు. షాప్​కి వెళ్లిన వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడని.. చిన్నారిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన చంద్రన్నను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:ACCIDENTS: నిర్లక్ష్యం చిన్నది.. విషాదం అంతులేనిది

ABOUT THE AUTHOR

...view details