ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఓ తండాకు చెందిన మహిళను హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసి చేశాడు ఓ వ్యక్తి. మృతదేహాన్ని బస్తాలో కుక్కి... అడవి పంది కళేబరం అని వేరే వ్యక్తికి చెప్పాడు. అతని సాయంతో తీసుకెళ్లి గార్ల మండలం తిరులాపురం రైల్వేగేటు వద్ద పడేశారు.
దారుణం: మహిళను హతమార్చి.. శరీర భాగాలు వేరు చేసి!
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను హతమార్చి... శరీర భాగాలు వేరు చేశాడు ఓ వ్యక్తి. అడవి పంది కళేబరం అని చెప్పి మరో వ్యక్తి సాయంతో మృతదేహాన్ని పడేశాడు. తోడు వచ్చిన వ్యక్తి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మహిళ దారుణ హత్య, కారేపల్లిలో మహిళ హత్య
సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా... అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి:కరోనా భయం... అంతిమ మజిలీ దారుణం