హైదరాబాద్ హయత్‌నగర్‌లోని దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కొందరు దుండగులు కిరాతంగా హత్య(Murder in Hayathnagar) చేశారు. బావర్చీ సమీపంలోని నడిరోడ్డుపై కారులో శవాన్ని వదిలేసి వెళ్లారు. ఆ కారును చూసిన కొందరు పార్కింగ్ చేసి ఉందని భావించారు. కానీ.. ఆ కారు దగ్గరి నుంచి వెళ్లిన వాళ్లు.. వెనుక సీట్లో ఏదో ఉండటాన్ని గమనించారు. పరిశీలించి చూస్తే.. అందులో ఓ శవం కనిపించింది. వ్యక్తిపై కారం చల్లి ఉండడం... రక్తపు మరకలు ఉండడంతో హత్య(Murder in Hayathnagar)గా అనుమానించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. కారు నంబర్ సగం విరిగి ఉండడంతో వివరాలు తెలియలేదు. పోలీసులు కేసును విచారిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Murder in Hayathnagar: కారులోనే వ్యక్తి దారుణ హత్య.. కారం పొడి చల్లి... - తెలంగాణ వార్తలు
కారులోనే వ్యక్తిని దారుణంగా హత్యచేశారు(Murder in Hayathnagar). కారం పొడి చల్లి మరీ హతమార్చారు(Murder in Hayathnagar). హయత్‌నగర్‌లోని హైవే బావర్చీ దగ్గర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Murder in Hayathnagar