నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఓ వ్యక్తిని అన్న, వదిన హత్య చేశారు. పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో మక్కల శ్రీనివాస్, సుశీల దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ తమ్ముడు మక్కల రాజు తన వదినతో తరచు అసభ్యంగా ప్రవర్తించేవాడని స్థానికులు తెలిపారు. పలుమార్లు మందలించారని పేర్కొన్నారు. బుధవారం అర్ధరాత్రి మద్యం మత్తులో మరోసారి వదినతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో అన్న, వదిన కలిసి బండరాయి, కర్రతో తలపై బలంగా కొట్టినట్లు వెల్లడించారు.
వదినతో అసభ్య ప్రవర్తన.. బండ రాయితో మోది చంపిన అన్న! - తెలంగాణ వార్తలు
వదినతో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తిని తన అన్నే హతమార్చిన ఘటన ఆర్మూర్ పట్టణంలో జరిగింది. పలుసార్లు మందలించినా వినకపోవడం వల్ల బండ రాయితో మోది హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
తమ్ముడిని చంపిన అన్న, ఆర్మూర్ హత్య కేసు
తీవ్ర గాయాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ కలహాల వల్ల మృతుడి అన్న ఈ హత్య చేశాడని ఏసీపీ రఘు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.