భార్యను కాపురానికి పంపించడం లేదని అత్తపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఆల్వాల గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. సట్టి నాగేంద్ర, రామస్వామి కుమార్తె శ్రావణితో పెద్దవూర మండలం పోతునూరు గ్రామానికి చెందిన తుమ్మ నాగరాజుకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగరాజు మద్యం సేవించి భార్య శ్రావణితో తరచూ గొడవ పడడంతో... ఆమె పుట్టింటికి వచ్చింది.
నాగరాజు ఆల్వాల వచ్చి భార్యతో గొడవపడినట్లుగా పోలీసులు తెలిపారు. శ్రావణి పక్కింటికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్త నాగేంద్ర గొంతును బ్లేడుతో గొంతు కోయడానికి యత్నించాడని వెల్లడించారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చారని... వెంటనే నాగరాజు పరారైనట్లు వివరించారు.