తెలంగాణ

telangana

ETV Bharat / crime

Missing: నాలుగేళ్ల కుమారుడితో సహా తండ్రి అదృశ్యం! - తెలంగాణ వార్తలు

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో తండ్రీకుమారుడు అదృశ్యమయ్యారు. మూడు రోజుల కిందట స్నాక్స్‌ కోసమని బయటకు వెళ్లిన వాళ్లు... తిరిగిరాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికంగా ఎంత వెతికినా ఆచూకీ లభించలేదని వాపోయారు.

a man missing with his son, a man missing in vikarabad
తండ్రీకుమారుడు అదృశ్యం, వికారాబాద్‌లో వ్యక్తి మిస్సింగ్

By

Published : Sep 14, 2021, 12:11 PM IST

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల కుమారుడితో సహా తండ్రి అదృశ్యం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. గాంధీ కాలనీకి చెందిన మోనగారి కార్తిక్, తన నాలుగేళ్ల కుమారున్ని తీసుకొని మూడు రోజులుగా కనిపించకుండాపోయారు. సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తానని చెప్పి... ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.

స్థానికంగా గాలించినా ఫలితం లేదని వాపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన భార్యకు, మామకు మెసేజ్ పంపినట్లు వెల్లడించారు‌. ఈ సందేశంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

లాక్‌డౌన్ కంటే ముందు కార్తిక్ బెంజ్ కార్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్ ఉద్యోగం చేసేవారని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?

ABOUT THE AUTHOR

...view details