తెలంగాణ

telangana

ETV Bharat / crime

LIVE VIDEO: ఫేస్​బుక్​ లైవ్​లో వ్యక్తి ఆత్మహత్య... ఎందుకంటే..! - తెలంగాణ వార్తలు

ఫేస్​బుక్ లైవ్​లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య, అత్త, ఆమె కుమార్తెల వేధింపులు తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

a man suicide, suicide live facebook
ఫేస్​బుక్​ లైవ్​లో వ్యక్తి ఆత్మహత్య, లైవ్​లో వ్యక్తి సూసైడ్

By

Published : Sep 28, 2021, 3:10 PM IST

ఫేస్​బుక్ లైవ్​లో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. తన భార్య, అత్త, ఆమె కుమార్తెల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది.

ఏం జరిగింది?

గుంటూరుకు చెందిన శంకరనారాయణ కుమారుడు ఉదయ్ భాస్కర్ కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. మదనపల్లెకు చెందిన సోనీతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఉదయ్ భాస్కర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం రాత్రి ఉదయ్ భాస్కర్ భార్య సోనీ పుట్టింటికి వెళ్లింది. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతున్నట్లు వీడియోలో చెప్పారు. ఫేస్​బుక్​లో ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది స్నేహితులు బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకునేలోపే ఆయన మృతి చెందారు.

భార్య ఫిర్యాదు ఇలా..

మద్యానికి బానిసై ఉదయ్ భాస్కర్ తరచూ వేధింపులకు గురి చేసేవాడని.. పలుమార్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశానని.. ఆదివారం కూడా గొడవ పెట్టుకొని కొట్టడంతో తాను పుట్టింటికి వెళ్లినట్లు మృతుడి భార్య సోనీ పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫేస్​బుక్​ లైవ్​లో వ్యక్తి ఆత్మహత్య

ఇదీ చదవండి:cheating with marriage proposal: మ్యాట్రిమోనీలో చూసి వలేశాడు.. ఆ వీడియోలు తీసి ఆన్​లైన్​లో...

ABOUT THE AUTHOR

...view details