సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో దారుణ హత్య జరిగింది. తనను హత్యకేసులో ఇరికించిందని కక్ష పెంచుకున్న మరిది.. వదినను హతమార్చి శవాన్ని తగులబెట్టాడు. అనంతరం నిందితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
హత్య కేసులో ఇరికించిందని వదినను చంపిన మరిది - ramapuram murder case
తనను హత్య కేసులో ఇరికించిందనే కక్షతో ఓ వ్యక్తి సొంత వదినను దారుణంగా హతమార్చాడు. శవాన్ని తగులబెట్టాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వదినను చంపిన మరిది
రామాపురం గ్రామానికి చెందిన రేఖ బాయమ్మ భర్త పిచ్చయ్య 2004లో హత్యకు గురయ్యాడు. పిచ్చయ్య హత్య కేసులో భార్య రేఖ బాయమ్మతో పాటు మరిది రేఖ సైదులు అనుమానితులుగా ఉన్నారు. అన్న హత్య కేసులో తనపేరు చేర్చినందువల్లే వదినను చంపినట్లు సైదులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.