ఓ వ్యక్తి ఏటీఎం ధ్వంసం (ATM Destroy) చేసిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ చందానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక యాక్సిస్ బ్యాంకు ఏటీఎం వద్దకు వచ్చిన వ్యక్తి పార తీసుకుని పగలగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచాం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సదరు వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని వివరాలు ఇంకా తెలవాల్సి ఉంది. కనీసం అతను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నడని పోలీసులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు.
ATM Destroy Video: మద్యం మత్తులో ఏటీఎంను ధ్వంసం చేశాడు.. ఇదిగో వీడియో! - మద్యం మత్తులో ఏటీఎంను ధ్వంసం చేశాడు.. ఇదిగో వీడియో!
హైదరాబాద్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏటీఎం (ATM Destroy) వద్ద హల్‌చల్ చేశాడు. చందానగర్‌లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి కలకలం రేపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. మందుబాబును అదుపులోకి తీసుకున్నారు.
ATM Destroy: మద్యం మత్తులో ఏటీఎంను ధ్వంసం చేశాడు.. ఇదిగో వీడియో!