వరసకు చెల్లెలైన యువతిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) ఇంటిపట్టునే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే లక్ష్మణ్ అనే వ్యక్తికి.. ఆ యువతి వరసకు సోదరి. అయినప్పటికీ.. ఆమెను తప్పుగా చూసిన లక్ష్మణ్.. దారుణానికి ఒడిగట్టాడు.
అమానవీయం.. చెల్లెలిపై అన్న అత్యాచారం! - సోదరి వరుసయ్యే యువతిపై అత్యాచారయత్నం న్యూస్
తండ్రిలా అండగా ఉంటూ.. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాటేశాడు. వావి వరసలు మరిచిపోయి వరసకు సోదరి అయ్యే యువతిపై అత్యాచారం చేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. సభ్యసమాజం తలదించుకునేలా దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో జరిగింది.
తన కోరిక తీర్చలేదని ఆమె నోటిలో గుడ్డలు కుక్కి లైంగిక దాడి చేశాడు. అదే సమయంలో కూలి పనికి వెళ్తున్న ఆ యువతి తల్లి.. ప్రమాదాన్ని గుర్తించింది. కూతురి కేకలు వినిపించడంతో తలుపులు తీసి చూసేలోపే... లక్ష్మణ్ అక్కడి నుంచి పారిపోయాడు. సొమ్మసిల్లి పడిపోయిన కుమార్తెను చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహిళ ప్రాణాల్ని తీసిన వివాహేతర సంబంధం