ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ గడ్డం వెంకటి గౌడ్ పంట చేనులో పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. జోరు వర్షంతో ఉప్పొంగిన వాగును దాటే క్రమంలో గల్లంతయ్యారు.
వాగులో పడి గల్లంతైన రైతు కూలీ - ఆదిలాబాద్ జిల్లా నేర వార్తలు
జోరుగా కురిసిన వర్షం ఓ వ్యవసాయ కూలీ గల్లంతుకు దారి తీసింది. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని గ్రామంలో చోటుచేసుకుంది.
వాగులో పడి గల్లంతైన రైతు కూలీ
గ్రామస్థులు ఆయన ఆచూకీ కోసం గాలించగా.. గ్రామానికి అరకిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.