తెలంగాణ

telangana

ETV Bharat / crime

కారు మంటల్లో చిక్కుకుని సచివాలయ​​ ఉద్యోగి మృతి.. ప్రమాదమా..? హత్యా..? - Car accident in Medak district

Car fire in Venkatapuram: మెదక్​ జిల్లా వెంకటాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. కారులో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదమా లేక ఎవరైనా కావాలనే హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Car fire in Venkatapuram
Car fire in Venkatapuram

By

Published : Jan 9, 2023, 3:07 PM IST

Car fire in Venkatapuram: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్‌లో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల్లో కాలిన వ్యక్తి భీమ్లా తండాకు చెందిన ధర్మగా గుర్తించారు. ఆయన హైదరాబాద్​ సెక్రటేరియట్​లో సీనియర్​ అసిస్టెంట్​గా పని చేస్తున్నారని.. ఈ నెల 5న కుటుంబసభ్యులతో కలిసి తండాకు వచ్చారని తెలిపారు.

ఘటనా స్థలంలో పెట్రోల్​ బాటిల్​తో పాటు మృతునికి సంబంధించిన ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్​ టీమ్​, డాగ్​ స్క్వాడ్​తో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోయాడా.. లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు.​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details